రియల్ ఎస్టేట్ గ్రూపు లలో ప్లాట్ల కొనుగోలుకు తమ డబ్బు అడ్వాన్స్ ల రూపంలో డిపాజిట్ చేసిన పెట్టుబడిదారులకు సూచనలు
ప్రియమైన డిపాజిట్/ పెట్టుబడి దారులారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి అనుమతులు లేని కొన్ని రియల్ ఎస్టేట్ గ్రూపులు భూమి కొనుగోలు అడ్వాన్స్ పేరిట డిపాజిట్ లను ప్రజల నుండి తీసుకొంటూ,అట్టి డిపాజిట్ల కు తక్కువ సమయంలో రెట్టింపు సొమ్ము, మరియూ నగదు డిపాజిట్ల కు బ్యాంకుల కంటే రెట్టింపు వడ్డీలు ప్రతినెలా ఇస్తామని చెబుతూ ప్రజల నుండి కోట్లాది రూపాయలను (ప్లాట్ల అడ్వాన్సు ల పేరుతో) డిపాజిట్లు గా స్వీకరిస్తున్నాయి. దీనితో పాటు, వందల సంఖ్య లో తాము కొనుగోలు చేశామని చెబుతున్న ప్లాట్లను,ఈ రియల్ ఎస్టేట్ గ్రూపుల లో చేరి డిపాజిట్ చేసిన వేలాదిమంది పోదుపరులకు కు హామీగా చూపుతున్నారు.
కొన్ని వేలమంది పెట్టుబడి దారులు ఇటువంటి కంపెనీలు, గ్రూపుల లో చేరి అవి మూత పడిన అనంతరం వారు డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగి పొందలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు గతంలో చూసారు .అగ్రి గోల్ద్ , బొమ్మరిల్లు , అభయ గోల్డ్ , సహారా,అక్షయ గోల్ద్, పి ఎ సి ఎల్ వంటి వాటిని చూసి మనం తెలుసుకొన్నాం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ C.I.D. వారు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో డిపాజిట్ లను వసూలు చేసే కొన్ని గ్రూపులపై కేసులు నమోదు చేయటంతో పాటు వాటి బాధ్యులను అరెస్ట్ చేసి జైలుకు పంపటం, వారి ఆస్తులను సీజ్ చేయటం జరిగింది . కాని ఇప్పటివరకు డిపాజిట్ దారుల సొమ్ము ఇటు రియల్ ఎస్టేట్ గ్రూపుల యాజమాన్యం గాని, ప్రభుత్వం కాని వారికి తిరిగి చెల్లించిన దాఖలాలు లేవు.
కావున ఇటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే గ్రూపుల లో డబ్బును డిపాజిట్ చేసి మోసపోయిన కొందరు పెట్టుబడి దారులతో ,ఆర్దిక చట్టాలు తెలిసిన కొందరు మేధావులతో కలసి ఒక అసోసియేషన్ గా ఏర్పడి తమతో పాటు, ఇతర, గ్రూపుల లో డిపాజిట్ చేసిన వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటం తో పాటు వారు మోసపోకుండా ఉండేందుకు కృషి చేస్తున్నారు .కావున మీరు మా యోక్క వెబ్ సైట్ www.depositorswelfareassociation.com లో ఉచిత సభ్యత్వం పొంది మీకేమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసికొవడం తో పాటు మా యోక్క సలహాలు, సూచనలు పొందండి.
మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును ఏ రియల్ ఎస్టేట్ గ్రూపుల లో డిపాజిట్ గా దాచుకున్నారో అట్టి గ్రూపుల యొక్క చట్టబద్దత తెలుసుకోండి
- ప్లాట్ల అడ్వాన్సు గా మీరు మీ డబ్బు డిపాజిట్ చేసిన రియల్ ఎస్టేట్ గ్రూపులకు మీవద్ద నుండి డిపాజిట్లు లేక పెట్టుబడులు స్వీకరించటానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు ఉన్నాయా,లేవా అనే విషయాలు తెలుసుకోండి*
అవి చట్టప్రకారం నడుస్తున్నాయా లేదా అనే విషయం తో పాటు, అటువంటి రియల్ ఎస్టేట్ గ్రూపులు మీకు ఇచ్చే రసీదులకు / బాండ్ల కు చట్టబద్దత ఉన్నదా,లేదా అనే సమాచారం తెలుసుకోండి
అట్టి రసీదులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ అయి ఉన్నాయా ?
రిజిస్టర్ కాని వాటికి చట్టబద్దత ఉన్నదా? అనే విషయం తెలుసుకోండి
భూముల అడ్వాన్స్ పేరుతో మీవద్ద తీసుకున్న డిపాజిట్ల కు ఈ రియల్ ఎస్టేట్ గ్రూపు వారు ప్రాంసరీ నోట్ ఎందుకు ఇస్తున్నారు అనే విషయాలు ఆలోచించండి
మీకు ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ వారు ఇచ్చిన ప్రాం సరి నోటు కాలపరిమితి 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుందని మీకు తెలుసా
మీరు నగదు గా డబ్బును ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ ల వారికి ఇచ్చి ప్రాంసరినోటు వ్రాయించు కుంటే అది చెల్లదు. దానికి ఎటువంటి చట్టబద్ధత లేదు అనే విషయం తెలుసా
మీరు డబ్బును చెక్కు లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే చెల్లించి ప్రాంసరి నోటు తీసుకోవాలి
మీరు డిపాజిట్ చేసిన కోట్లాది రూపాయలను ఆయా గ్రూపులు సక్రమంగా వినియోగిస్తున్నాయా? వాటి వివరాలు తెలుసుకొనే అధికారం మీకు ఉందా? అనే విషయం మావద్ద తెలుసుకోండి
*మీరు డిపాజిట్ చేసిన కోట్లాది రూపాయలతో భూములు/ప్లాట్లు / ఆస్తులు కొంటున్నామని చెబుతున్న ఆయా గ్రూపుల నిర్వాహకులు ఎవరి పేర్లపై ఆ ఆస్తులు కొంటున్నారు ?
అవి ఆయా రియల్ ఎస్టేట్ గ్రూపులు పేరుపై రిజిస్టర్ అయి ఉన్నాయా? లేక కొందరు వ్యక్తుల / వారి కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్టర్ అయి ఉన్నాయా?
ఆ భూముల రిజిస్టేషన్ అసలు విలువ ఎంత? అనే వివరాలు మీవద్ద ఉన్నాయా? తెలుసుకోండి
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఈ గ్రూపులు తాము కొనుగోలు చేసినట్లు చెబుతున్న భూముల/ప్లాట్ల తాలూకు యజమాని ఎవరు? ఎవరి పేరు పై ఈ సర్వే నెంబరు, ప్లాట్ నెంబర్లు ఉన్నాయో తెలుసు కున్నారా
ఇవి ఏ గ్రామం ఏ మండలం ఏ జిల్లా ఏ రాష్ట్రం లో ఉన్నాయో అట్టి వివరాలు మీరు తెలుసుకున్నారా?
ఈ రియల్ ఎస్టేట్ గ్రూపులు సేకరించిన పెట్టుబడులు/ డిపాజిట్ల మొత్తానికి సరిపోయే సమాన విలువగల ఆస్తులు ఆయా రియల్ ఎస్టేట్ గ్రూపులు వద్ద ఉన్నాయా?
ఆ దిశలో,మీరు ఆలోచించారా ? అట్టి ఆస్తుల వివరాలు మీకు ఇవ్వమని మీ ఏజంట్ల ను మెనేజర్ల ను,ఈ గ్రూప్ ల యాజమాన్యాన్ని అడిగారా
లేకపోతే ఇప్పటి కైనా ఈ విషయాలు అడిగి తెలుసుకోండి
రియల్ ఎస్టేట్ గ్రూప్ కింద నమోదై డిపాజిట్లు/ పెట్టుబడులు సేకరిస్తున్న డబ్బును వారి సొంత వ్యాపారాలకు వారి (చైర్మన్ ,ఎం.డి ,డైరెక్టర్ల ) కుటుంబ అభివృద్ధికి వినియోగించు కుంటున్నారా ? అనే విషయం తెలుసుకోండి
ఒకవేళ రియల్ ఎస్టేట్ గ్రూప్ చైర్మన్ ,ఎం.డి , డైరెక్టర్లు వారి సొంత వ్యాపారాలకు ఈ డిపాజిట్ / పెట్టుబడులను వాడు కుంటుంటే ఒకవేళ వారి వ్యాపారాలలో నష్టం వస్తే డిపాజిట్ దారుల పరిస్తితి ఏమిటి? అని ఆలోచించారా
మీ డిపాజిట్ లతో వ్యాపారాలు చేస్తూ వారు గడిస్తున్న లాభాలను ఇప్పటివరకు మీరు పెట్టుబడి పెట్టిన రియల్ ఎస్టేట్ గ్రూప్ యాజమాన్యం మీకు తెలిపారా?
మీ పెట్టుబడులను మూడింతలు చేశామని చెబుతున్న ఈ గ్రూప్ ల యాజమాన్యం మీకు ప్రతినెలా ఇచ్చే వడ్డీ మినహాయించు కొని మిగిలిన లాభాలను (డివిడెండు) ప్రతిసారి మీకు పంచుతున్నారా?
ప్రతి సంవత్సరం మీరు పెట్టుబడి పెట్టిన రియల్ ఎస్టేట్ గ్రూపుల ఐ టి రిటన్ల ను లాభనష్టాల నివేదిక లను మీరు పరిశీలిస్తున్నారా?
మీ డబ్బులతో ఆస్తులు కొనుగోలు చేశామని చెబుతున్న గ్రూపుల యజమానులు ఆ ఆస్తులను మీరు తమవద్ద దాచుకున్న డబ్బుకు సెక్యూరిటీ గా ఉంచారా? లేక ఇతర బ్యాంకులకు, తాకట్టు / మార్ట్ గేజి చేసి వాటిపై లోన్లు తీసికొని సొంతానికి వాడుకుంటున్నారా ?
ఈ విషయాలు మీకు వారు తెలిపారా? లేకపోతే మీరు ఇప్పటికైనా తెలుసుకొండి
రియల్ ఎస్టేట్ గ్రూపుల పేరుపై మీరు డిపాజిట్ చేసిన డబ్బుకు వీటి నిర్వాహకులు మీకు 100 శాతం లిక్విడిటీ (హామీ) ఎలా ఇస్తారో మీరు వ్రాత పూర్వ కంగా వారినుండి తీసికున్నారా?
రియల్ ఎస్టేట్ పేరుపై వ్యాపారం చేస్తున్న గ్రూపుల ఏజంట్లకు కు బ్రాంచి మేనేజర్ల కు సూచనలు
మిమ్మల్ని మీ గుడ్ విల్ ను ,మీ క్రేడిబులిటి ని నమ్మిన డిపాజిట్ దారులు కేవలం మీపై గల నమ్మకం మరియూ విశ్వాసం తో మీ పట్టణాలలో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ గ్రూపుల కార్యాలయాలలో కోట్లాది రూపాయలను మీ ద్వారా డిపాజిట్ చేస్తున్నారు
మీరు ఏజంట్లు గా, బ్రాంచి మేనేజర్ లుగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ గ్రూపుల యొక్క డిపాజిట్ దారులు భవిష్యత్తులో ఎటువంటి మోసాలకు గురికాకుండా ఉండాలి అనుకొంటే మీరు నమ్మిన గ్రూపుల యొక్క చట్టబద్దత ను తెలుసుకోటానికి మమ్మల్ని సంప్రదించండి
కేవలం తీయని మాటలు, ప్రవచనాలు,మరియూ ఆచరణ యోగ్యం కాని భవిష్యత్ హామీలు మీ డిపాజిట్ లకు ఏమాత్రం సెక్యూరిటీ గా ఉండవు.
డిపాజిటర్లను మోసం చేసి మూసి వేసిన రియల్ ఎస్టేట్ గ్రూపుల పరిస్తితి మీరు తెలుసు కావాలంటే ఈ వెబ్ సైట్ లో ఈ లింకు ను లో చూడండి
“www.depositorswelfareassociation.com”
- ప్లాట్ ల అడ్వాన్సు ల పేరుతో మీ ద్వారా వేల కోట్లు వసూలు చేస్తున్న రియల్ ఎస్టేట్ గ్రూపులు చట్టప్రకారం మే పెట్టుబడులు / డిపాజిట్ లు సేకరిస్తున్నాయా అనే విషయాలు తెలుసుకోవటం మీ హక్కు అందుకు మేము సహకరిస్తాము*
మిమ్మల్ని నమ్మిన డిపాజిటర్ల కొరకు మీరు చట్టం తెలుసుకోండి
మీవద్ద ఉన్న డిపాజిట్ రసీదులను స్కాన్ చేసి మన పై వెబ్ సైట్ లోని deposit receipts లింకు కు అప్ లోడు లేదా మెయిల్ చేయండి. లేదా డిపాజిట్ రసీదులను ఫోటో తీసి WhatsApp నెంబరు 9441069388 కు పంపండి.
మమ్మల్ని సంప్రదించేందుకు ఈమెయిల్ మరియూ ఫోన్ చేయండి
www.depositorswelfareassociation.com
E mail: depositorswelfare@gmail.com ,
Mobile: 9441069388; &
9059682221 (1.30 pm to 9.00pm)