తెలంగాణ రాజధానిలో త్వరలో పేలనున్న రియల్ ఎస్టేట్ బాంబ్ వేలాది మంది పాపర్ లు అయ్యే అవకాశం.
తెలంగాణ రాజధాని లో అగ్రిగోల్డ్ బాటలో నడవనున్న మరో రియల్ ఎస్టేట్ గ్రూపు.
వేలాదిమంది ఇన్వెస్టర్ల నుంచి భూమి విక్రయం పేరుతో వందల కోట్ల రూపాయల అడ్వాన్స్ లు వసూలు .
ప్రజల పెట్టు బడులతో రియల్ గ్రూప్ కుటుంబ సభ్యుల పేర్లపై వందల ఎకరాల భూమి కొనుగోలు.
పెట్టుబడి దారులకు హామీగా రూపాయి రెవెన్యూ స్టాంప్ తో రసీదు / బాండు, ప్రాంసరి నోటు మాత్రమే ఇస్తున్న ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్.
భూ విక్రయ అడ్వాన్సు ల పేరుపై పెట్టుబడి / డిపాజిట్ తీసికొని నెల నెలా కోట్లాది రూపాయల వడ్డీ ఇన్వెస్టర్లకు చెల్లిస్తున్న వైనం.
అడ్వాన్స్ ఇచ్చిన 100 మందిలో ముగ్గురికి కూడా చేయని భూ విక్రయం, భూమి విక్రయ రిజిస్ట్రేషన్ లు.
బ్యాంకుల్లో దాచిన డబ్బుకు గ్యారంటీ ఉండదని , తమ వద్ద రూపాయికి మూడు రూపాయల భద్రత ఉంటుందని యూట్యూబ్ వీడియోల ద్వారా పెట్టుబడి దారులకు గ్రూప్ యాజమాన్యం నోటి హామీ.
ఈ రియల్ గ్రూపుకు భూములు ఏక్కడ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి వాటి వివరాలు వాటి రిజిస్ట్రేషన్ విలువ ఎంత అనేది దేవరహస్యం.
ఏ జిల్లాలో ,ఏ మండలంలో, ఏ రివెన్యూ గ్రామంలో , ఏ సర్వే నెంబర్ల లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, అది ఎవరి పేరుపై ఉన్నది , అట్టి భూమి రిజిస్ట్రేషన్ విలువ ఎంత, అనేది ఎవరికి చెప్పం అంటున్న రియల్ గ్రూప్ యాజమాన్యం.
200 లోపు ఎకరాల భూమి ని వేలాది పెట్టుబడిదారులకు ఎలా ఇస్తారు అనేది జవాబు లేని ప్రశ్న.
రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులే ఈ రియల్ గ్రూప్ టార్గెట్
ప్రతి సంవత్సరం వందల మందితో సమావేశాలు, ఎక్కువ డిపాజిట్ చేసిన వారికి, ఎక్కువ మంది సభ్యులను చేర్పించిన వారికి నగదు, బంగారం బహుమతులు ఇస్తున్న ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన సెబీ, ఆర్బీఐ ల నుండి తమకు ఎటువంటి అనుమతులు అవసరం లేదంటున్న గ్రూపు యాజమాన్యం.
సెబీ చట్టం లో 100 కోట్లు డబ్బు సేకరణ దాటిన ఏ సంస్థ అయినా కలెక్టివ్ ఇన్వెష్ట్ మెంట్ CSI పరిధి లోకి రావాల్సిందే,
ఇండియన్ కాంటాక్ట్ యాక్ట్ ప్రకారం తాము పెట్టుబడులు / అడ్వాన్సులు తీసుకుంటున్నామని ఈ రియల్ గ్రూప్ వెల్లడి .
ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో పెట్టిన నిబంధనను అమలు చేయని వైనం .
ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో పెట్టిన నిబంధనను పాటించకుండా , స్థానిక Sub registrar కార్యాలయం లో రిజిస్ట్రేషన్ లు చేయకుండానే అగ్రిమెంట్లు రసీదులు, బాండ్లు పెట్టుబడిదారులకు ఇస్తున్న రియల్ ఎస్టేట్ గ్రూప్.
Sub registrar కార్యాలయం లో రిజిష్టర్ కాని ఇన్వెస్ట్ మెంట్/ డిపాజిట్ రసీదులకు , బాండ్లకు ఎటువంటి చట్టబద్ధత లేదంటున్న ఆర్థిక ,న్యాయ నిపుణులు .
గతంలో ఇదే ప్రకారం భూముల అడ్వన్సుల పేరుతో వేలాది మంది నుండి కోట్లు వసూలు చేసి పెట్టుబడిదారులను నిండా ముంచిన అగ్రిగోల్డ్ ,అభయ గోల్డ్ ,అక్షయ గోల్డ్ ,పి ఎ సి ఎల్ , సహారా వంటి రియల్ ఎస్టేట్ గ్రూపులు .
వేలాదిమంది ఇన్వెస్టర్లు కోట్లాది రూపాయల పెట్టుబడులు ఇటువంటి రియల్ ఎస్టేట్ గ్రూప్ లో పెట్టి మోసపోతున్నా పోలీసు శాఖ మౌనం .
ఎవరైనా పిర్యాదు చేస్తే మాత్రం బాధితులకు డబ్బు ఇప్పించిన ఘనత TS పోలీసులదే.
ఇట్టి రియల్ ఎస్టేట్ గ్రూపుల పై లోతుగా దర్యాప్తు జరపని పోలీసు ఉన్నతాధికారులు .
ఎటువంటి అనుమతులు లేని ఇటువంటి రియల్ ఎస్టేట్ గ్రూప్ లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ,ఉభయ రాష్ట్రాల పోలీస్ శాఖలు స్పందించాలి.
కోట్లాది రూపాయలు ప్రజలనుండి వసూలు చేసే ఇటువంటి రియల్ గ్రూపుల పై ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని పోలీసులు సుమోటో గా కేసులు నమోదు చేయాలి .
అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ వంటి సంస్థల మరియు ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ మొడాస్ ఆపరెండి ఒకేలా ఉన్నందున పూర్తి స్థాయి లో ఆర్థిక నేరాల విభాగం తో దర్యాప్తు చేయాలి .
ఇప్పటికే ఈ రియల్ గ్రూప్ పై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన పెట్టుబడిదారులు .
రాచకొండ సీపీ ,పోలీసు అధికారులు గతంలో ఈ గ్రూప్ యాజమాన్యంతో మాట్లాడి కోట్లాది రూపాయలను భాదితులకు ఇప్పించి న్యాయం చేసిన వైనం.
హైదరాబాదు రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో ఈ సంస్థపై 1200 కేసులు ఉన్నట్టు వినికిడి.
ఈ సంస్థ చట్టబద్ధతపై ప్రశ్నించిన పెట్టుబడిదారులపై సివిల్ ,క్రిమినల్ కేసులు పెడతామని గ్రూపు యాజమాన్యం గాండ్రింపు.
తమ గ్రూప్ ను ప్రశ్నించే అధికారం లేదని డిపాజిట్ దారులకు బెదిరింపు లేఖలు
వందలాది కేసులు తమపై ఉన్నా ఎటువంటి ఫిర్యాదులు లేదని బుకాయింపు .
పిర్యాదులు ఇవ్వనంత మాత్రాన డిపాసిట్లు సేకరణ చట్టబద్ధమేనా.
ఈ రియల్ ఎస్టేట్ గ్రూపు పనితీరుపై పలువురు పెట్టుబడిదారుల అసహనం.
74 మందితో పెట్టుబడిదారులు ఒక గ్రూపుగా ఏర్పడ్డ వైనం.
ఈ రియల్ గ్రూప్ పెట్టుబడుల సేకరణ యొక్క చట్ట బద్దత పై రాష్ట్ర ప్రభుత్వ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న బాధితులు.
అందులో సెబి ,ఆర్బిఐ, ఈడి , ఉభయ రాష్ట్ర పోలీసులను భాగస్వామ్యం చేసేందుకు సభ్యుల నిర్ణయం .
దీంతోపాటు ఆర్థిక న్యాయ నిపుణులతో ప్రెస్ మీట్ లు.
మరియు ప్రముఖ టీవీ ఛానల్ లో ఈ గ్రూప్ వసూళ్లపై డిస్కషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి .
దీంతోపాటు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఈ రియల్ ఎస్టేట్ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన మధుపర్లకు తగిన అవగాహన కలిగించేందుకు మోసపోయిన పెట్టుబడిదారుల సంఘం సన్నాహాలు.
కంపెనీల చట్టం 2013 కింద నమోదైన ఏ సంస్థ అయినా సెక్షన్.73 ప్రకారం వ్యక్తుల వద్ద ఏ పేరుతో అయినా తీసికొన్న డబ్బును తిరిగి వడ్డీ కలిపి వెనక్కి ఇవ్వటం చట్ట వ్యతిరేకం
యాజమాన్య సంస్థలు( ప్రొప్రైటరీ షిప్ ) ఎటువంటి పెట్టుబడులు, డిపాజిట్లు తీసుకోరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎనిమిది డిపార్ట్మెంట్లు కలిసి ఇచ్చిన పోస్టర్లో RBI ప్రజల అవగాహన కొరకు ఇష్యూ చేసిన ఒక పోస్టర్లో (ఈ వెబ్ సైట్ లో ఉన్నాయి చూడండి) కచ్చితంగా తెలిపారు
పెట్టుబడులు, డిపాజిట్లు, భూమి అడ్వాన్స్ రూపంలో వసూలు చేస్తున్న ఈ గ్రూపు తమ లీగల్ కౌన్సిల్ ద్వారా ఒక డిపాజిట్ దారుడికి ఒక లేఖ రాస్తూ తాము చేస్తున్న పెట్టుబడుల సేకరణకు ఎటువంటి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు అవసరం లేదని తెలుపుతూ తమ గ్రూపు యాజమాన్య సంస్థ ( PROPRIETOR SHIP) అని తెలిపారు
అయినా ఆగని డిపాజిట్ల సేకరణ .ఈ పాయింట్ నే ఆర్బీఐకు సెబీకు ఈడి , పోలీసులకు తెలియజేసి డిపాజిటర్లకు లేదా పెట్టుబడిదారులకు న్యాయం చేయాలని బాధితుల సంఘం భావిస్తుంది
వెంటనే బాదితులు తమ పేర్లను నమోదు చేయండి ఈ సైట్ ద్వారా లేక whatsapp No.9441069388 ద్వారా
No company or individual is allowed to mobilize deposit from public unless and until the SEBI or RBI allows to collect deposits.
Don’t be carried away by the tall chains, glossy brochures and high returns on you hard earned money.
Don’t be entrapped by the promises of doubling or trading your deposited amount within a short period.
Some ponzy firms or Real estate groups are masque acting in the guise corporate giants Don’t trust them.
SEBI and CBI have seized the properties and freezed the Bank accounts of many ponzy schemes.
If you have excess funds or savings deposit them in banks or government approved financial institutions.
SEBI, RBI, vigilance department, CBI and CID have unearthed many such ponzy group/firms. Still some low profile ponzy groups are alive in the market. Beware of them.